సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి : ముర్షిదాబాద్, మేదినీపూర్‌లో మహమ్మద్ సలీం, బిమన్ బసు ప్రచారం
ముర్షిదాబాద్: బీజేపీ, తృణమూల్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలంటే సీపీఐ(ఎం) తరఫున బరిలో దిగిన అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. ప్రజాసమస్యలపై పోరాడే సత్తా ఉన్న వారికే ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం జరగనుండగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రచారపు చివరి రోజైన సోమవారం వామపక్ష అభ్యర్థులు హోరెత్తించారు. ముర్షిదాబాద్‌లోని జలంగి శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి యూనస్ అలీ సర్కార్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం, బలిగాగ్య శాసనసభ నియోజక వర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి అఫ్రిన్ బేగం పాల్గొన్నారు.
రాణినగర్, హరిహర్ పారా, డోమ్ కల్లోనూ సీపీఐ(ఎం) అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమ మేదినీపూర్‌లోని సబాంగ్, నారాయణగఢ్కు చెందిన ఇద్దరు సీపీఐ(ఎం) అభ్యర్థులకు మద్దతుగా లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు రోడ్ షో నిర్వహించారు. సబాంగ్లోని బచ్చారా నుంచి దాస్‌గ్రామ్ వరకు జరిగిన ఈ కార్యక్రమానికి బిమన్ బసు నేతృత్వం వహించారు. సబాంగ్ సీపీఐ(ఎం) అభ్యర్థి నకుల్ చంద్ర బేరా, నారాయణగఢ్ సీపీఐ(ఎం) అభ్యర్థి తపస్ సిన్హాకు ప్రజలు మద్దతు తెలిపారు.
సబాంగ్లోని మూడు గ్రామ పంచాయ తీలు, నారాయణగఢ్‌లోని ఒక గ్రామ పంచాయతీ సరిహద్దుల వెంబడి జరిగిన ఈ రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు.
బీజేపీ, తృణమూల్ దౌర్జన్యాలకు అడ్డుకోవాలి
- Advertisement -
- Advertisement -



