- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు, పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో సెర్ప్ భాగస్వామ్యంతో సబ్సిడీపై గేదెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, 100 వెటర్నరీ డాక్టర్, 304 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు.
- Advertisement -



