- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 పోస్టుల భర్తీకి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ రద్దయినట్లు అభ్యర్థులు గుర్తించాలని సూచించింది. కొత్త రోస్టర్, నిబంధనల ప్రకారం ఈ వారంలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
- Advertisement -



