- Advertisement -
-మానకొండూర్ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అదేశం
నవతెలంగాణ-బెజ్జంకి
ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను బీఎల్ఓలు సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్ అదనపు కలేక్టర్, మానకొండూర్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిష్ట్రేషన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు తోటపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను అదనపు కలేక్టర్ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ అయేషా రఫత్, సిబ్బంది రమేశ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు. సర్పంచులు బొల్లం శ్రీధర్, జుట్టు ఆశ్విని, ముక్కీస కవిత, బీఎల్ఓలు హజరయ్యారు.
- Advertisement -



