- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమార్తె జహ్రా పెజెష్కియాన్, ఆమె భర్త హసన్ మజీదీ, న్యూఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంలోని బ్రిక్స్ బజార్‌ను సందర్శించారు. అక్కడ వారు బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వస్త్రాలు, హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలను పరిశీలించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి, కోడర్మ లోక్‌సభ ఎంపీ అన్నపూర్ణా దేవి కూడా ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో న్యూఢిల్లీలోని బ్రిక్స్ బజార్ నందు సెప్టెంబర్ 10 నుండి 15 వరకు నేషనల్ క్రాఫ్ట్స్ , హస్తకళా సందర్శన శాలను ఏర్పాటు చేశారు.
- Advertisement -



