Saturday, September 12, 2026
E-PAPER
Homeజిల్లాలుసీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగించాలి

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగించాలి

- Advertisement -

 దేశ రాజకీయాలలో ఏచూరికి ప్రత్యేక గుర్తింపు 
నవతెలంగాణ-అచ్చంపేట

మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్ధం  సైదులు అన్నారు. శనివారం ఏచూరి రెండవ వర్ధంతిని పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ముందు కూలీల అడ్డలో నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సీతారాం ఏచూరి ప్రజా సమస్యల పైన, పేదలకు కల్పించవలసిన వసతులపైన పార్లమెంటులో గలం విప్పారని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేశారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు శంకర్ నాయక్, నాయకులు మల్లేష్, అడ్డ కూలీలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -