Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎరువుల కొనుగోలుకు రైతుఐడీ తప్పనిసరి: ఏఈఓ

ఎరువుల కొనుగోలుకు రైతుఐడీ తప్పనిసరి: ఏఈఓ

- Advertisement -

నవతెలంగాణ – చిన్నగూడూరు
ఉగ్గంపల్లి క్లస్టర్ పరిధిలో రైతు ఐడీ కోసం ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏఈఓ శిరీష సూచించారు. రైతు ఐడీ నమోదు చేసుకుంటేనే పీఎం-కిసాన్‌తో పాటు ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొనుగోళ్లలో కొత్తగా యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేస్తోందని, ఈ విధానంలో రైతు ఐడీ లేకుండా ఎరువులు పొందడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధిగా రైతులందరూ రైతు ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. రైతు ఐడీ నమోదు కోసం రైతులు తమ స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -