కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్
నవతెలంగాణ – మల్హర్ రావు
పల్లెల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం డిఎంఏప్టి నిధుల ద్వారా మంథని నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బోర్ బావులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మండలంలో దాదాపు 18 బోరు బావులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా అడ్వాలపల్లిలో గ్రామపంచాయతీ వద్ద రెండు బోర్ బావులు మంజూరు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్ బావులు మంజూరు నేపథ్యంలో జిపిల తీర్మాణాలతో కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు, మరి కొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్లు వేస్తున్నట్లుగా తెలిపారు. అడ్వాలపల్లి గ్రామ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మంజూరు చేసిన బోర్ బావులను తాను ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం బోర్ వేయించానని సర్పంచ్ చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తే పంచాయతీ తీర్మానం మేరకు బోర్ వేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.



