Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచివరి శ్వాస వరకు పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి

చివరి శ్వాస వరకు పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి

- Advertisement -

– రాజకీయాల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడంలో ఆయన పాత్ర కీలకం
– ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు వేదికగా పోరాడిన గొప్ప మేధావి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
– సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ద్వితీయ వర్ధంతి సభ
నవతెలంగాణ – సంగారెడ్డి :
చివరి శ్వాస వరకు పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి అని, రాజకీయాల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడంలో ఆయన చేసిన పాత్ర కీలకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏచూరీ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుక్క రాములు హాజరైనారు.

ఈ సందర్భంగా చుక్క రాములు ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు వేదికగా పోరాడిన గొప్ప మేధావి ఏచూరీ అన్నారు. లౌకిక విలువలు కోసం, భారత దేశంలో సోషలిజం సాధన కోసం, జీవించినంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న మహా నేత ఏచూరి అన్నారు. పార్లమెంట్ లోను బయట ప్రజా సమస్యలు పై పోరాడిన యోధుడు అని, మతోన్మాద ప్రమాదం పై రాజ్యాంగ పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేత ఏచురి అని కొనియాడారు. తన నిరంతర అధ్యయనంతో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అవపోశన పట్టారని అన్నారు. సమాజంలో ఉన్న దోపిడీనీ, పీడనను రూపుమాపి సమసమాజ స్థాపనకు మార్క్సిజమే మార్గమని, ఆసిద్ధాంతాన్ని నమ్మి, ఆ మార్గం వైపు ప్రజలను నడిపించేం దుకు అనేక పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమ నేతగా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోరాటాల బాట పట్టిన ఆయన దేశ రాజకీయాలను సమగ్రంగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఏచూరి దేశ రాజకీయాలను మలుపు తిప్పే అనేక నిర్ణయాలలో భాగస్వామిగా ఉన్నారని అన్నారు.

దేశం మతోన్మాదం ప్రమాదంలో పడుతున్న దశలో ప్రత్యేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయటంలో మతోన్మాద కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించడంలో ముందు వరసలో ఉండేవారన్నారు. ప్రజాసమస్యలు పరిస్కారం కోసం,శ్రామిక రాజ్యం సాధన కోసం పోరాటం చేయడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సీతారం ఏచూరి స్ఫూర్తితో ప్రజాసమస్యలు పరిస్కారానికి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మానిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, యాదగిరి, విద్యాసాగర్, రేవంత్, మహిపాల్, కృష్ణ, నాయకులు అశోక్, రమేష్ గౌడ్, లక్ష్మీ,మంజుల, సురేష్, బాలరాజు, శివకుమార్, దత్తు, మహేష్ తది తరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -