- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల తీవ్రతకు జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా నిర్మించిన వంతెన నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దాదాపు 15 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నిత్యావసర సరుకుల రవాణాతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం ఈ 15 గ్రామాల గిరిజనులు ఈ ఒక్క వంతెనపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తుంటారు.
- Advertisement -



