నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన పోటీల్లో శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర యాదయ్య తెలిపారు. శనివారం ఎంపికైన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే పోటీలలో మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
అండర్ 14 విభాగంలో 8వ తరగతి విద్యార్థిని యు.అక్షిత 600 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ బహుమతి సాధించింది. ఎనిమిదవ తరగతి విద్యార్థి బి.రాకేష్ లాంగ్ జంప్ లో ప్రథమ బహుమతి, అండర్ 17 విభాగంలో 9వ తరగతి విద్యార్థిని టి.శిరీష షాట్ పుట్ లో ద్వితీయ బహుమతి, అండర్ 17 విభాగంలో కబడ్డీలో ద్వితీయ బహుమతి సాధించారు. అండర్ 17 విభాగం కబడ్డీలో పదవ తరగతి విద్యార్థులు ఆర్.ధనుష్, బి.రుతిక్, ఐ.జస్వంత్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేందర్, జోసెఫ్, షఫి, రవీందర్, జె భవ్య, కళ్యాణి, స్వప్న, ప్రమీల, శిరీష, మమత, మౌనిక, కనకలక్ష్మి, సరిత, మాధవి పాల్గొన్నారు.



