Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి సర్కిల్ ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తుంగతుర్తి సర్కిల్ సీఐ ఉపేందర్ రావు అన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున నీటి వనరులను కాపాడుకోవడం అందరి బాధ్యతని, మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం, చిన్న విగ్రహాలను పెట్టడం ద్వారా నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చని, పర్యావరణాన్ని కాపాడవచ్చునని తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

మండపాల వద్ద 24 గంటలు ఇద్దరు వ్యక్తులు ఉండాలని, ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించరాదని, బలవంతంగా చందాలు అడగకూడదని, విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 112 కు డయల్ చేయాలని సూచించారు. నిమజ్జన సమయంలో నీటి వనరుల పరిశుభ్రతను కాపాడాలని కోరారు. “మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మన నీటి వనరులను కాపాడుకుందాం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -