నవతెలంగాణ-ఆలేరు టౌను
ఎస్సీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినీల వసతి గృహంలో చంచల్ మిట్టల్ జయంతి పురస్కరించుకొని, విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం దీన శరణ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సామాజిక వేత్త చంచల్ మిట్టల్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు పుస్తకాలు, తదితర స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ ఆర్ శైలజ, సంస్థ చైర్మన్, చింతల సాయిబాబా మాట్లాడుతూ.. బాలికలకు క్రమశిక్షణ పట్టుదల లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఉన్నత ఉద్యోగాలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి ,నీట్ ఎగ్జామ్స్ పాస్ కావాలంటే లక్ష్యం ఏర్పాటు చేసుకొని సమయపాలన క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకొని ఏకాగ్రతతో చదివినట్లయితే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు అయితె వెంకటేష్ హాజరయ్యారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్. శైలజ, దీన శరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.



