ఇంటి నిర్మాణంపై శిక్షణ పొందుతున్న భవన నిర్మాణ కార్మికులు

నవతెలంగాణ- చండూరు

మున్సిపల్ కేంద్రంలోని  బ్రహ్మంగారి గుడి పక్కన  ఉన్న ఓల్డ్  గీత స్కూల్  లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్( ఎన్ ఏ సి ) ఆధ్వర్యంలో గత 12 రోజులుగా గ్రామీణ భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యంపై ఇస్తున్న ప్రత్యేక శిక్షణ కొనసాగుతోంది. 18 సంవత్సరాల నుం – చి 45 సంవత్సరాల లోపు వారికి  ఆ సంస్థ సెంట్రల్ ఇన్చార్జి ఎస్ డి  అఫ్రోజ్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మూడు బ్యాచులుగా విభజించారు. ఇందులో ఒక్కొక్క బ్యాచ్ కి 30 చొప్పున ఉన్నారు. మొత్తం 90  మంది కార్మికు లు శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. 15 రోజులు శిక్షణ  పూర్తి అయిన వారికి  రూ.4500 ఇవ్వ ఉన్నట్లు   సంస్థ పేర్కొంది. మరో నాలుగు రోజులు మొదటి మూడు  బ్యాచ్ పూర్తి కానుంది.    ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్ డి. అఫ్రోజ్ శిక్షణ కార్మికులకు కట్టుడు విధానం పై అవగాహన,  పలు సూచనలు, జాగ్రత్తలు  తీసుకోవాలని సూచించారు . ఆసక్తిగల లేబర్ కార్డు కార్మికులు   ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్  రాములు, శివాజీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు  చేన్నగాని శేఖర్ , భవన నిర్మాణ  కార్మికులు పాల్గొన్నారు.
Spread the love