- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జన్మదిన వేడుకలను ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జిల్లెల జగత్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



