Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేసింగ్ ట్రాక్‌పై విజయ్, అజిత్..

రేసింగ్ ట్రాక్‌పై విజయ్, అజిత్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న విజయ్, అజిత్ కుమార్ మధ్య అరుదైన కలయిక చోటుచేసుకుంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో వీరిద్దరూ కలుసుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌కు, నటుడు అజిత్ కుమార్ ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. నిన్న‌ రేసింగ్ అనంతరం విజయ్‌ను కలిసిన అజిత్, ఆయన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) రంగులను పోలిన రేసింగ్ సూట్‌ను బహూకరించారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప‌ట్ల‌ విజయ్ ఆనందం వ్య‌క్తం చేశారు. కేవలం బహుమతితోనే సరిపెట్టకుండా రేసింగ్ పట్ల మక్కువ ఉన్న అజిత్.. స్వయంగా కారు నడుపుతూ విజయ్‌తో కలిసి ట్రాక్‌పై నాలుగు ల్యాప్‌లు చక్కర్లు కొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -