- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్ మల్లేశ్‌ను సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి నుంచి మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరినీ పోలీసులు విచారించనున్నారు. ఆయుధాల చోరీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌పై ఆరా తీయనున్నారు. ఆయుధాలను మల్లేశ్ ఎవరికి అప్పగించాలనుకున్నాడనే అంశంపై విచారించనున్నారు. అతడు చెప్పే కీలక వివరాలను ఎన్‌ఐఏకు రాష్ట్ర పోలీసులు అందించనున్నారు.
- Advertisement -



