Sunday, September 13, 2026
E-PAPER
Homeఆటలుఅఫ్గనిస్థాన్‌తో తొలి టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

అఫ్గనిస్థాన్‌తో తొలి టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ కాసేపట్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టే వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్న వేళ.. ఈసారి వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అఫ్గన్ టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్‌ ఆడుతున్న ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని చెప్పాడు.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు స్వదేశంలో పంజా విసరాలనుకుంటోంది. వరసగా రెండు సిరీస్‌లు చేజారినందున అఫ్గనిస్థాన్‌పై క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడనుంది టీమిండియా. ఆదివారం తొలి టీ20ని విజయంతో మొదలెట్టాలని భావిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేన బౌలింగ్ తీసుకుంది. ఫిట్‌నెస్ నిరూపించుకున్న నితీశ్ రెడ్డి, సుందర్, బుమ్రాలు తుది జట్టులోకి రాగా.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అఫ్గనిస్థాన్‌ కూడా మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయాలనుకున్న నవీన్ ఉల్‌ హక్‌ను తీసుకోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -