- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలవుతోంది. సిటీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్ మహా గణపతి పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
- Advertisement -



