Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుంటుందని అన్నారు.

దైవ పూజలను, ధార్మిక క్రతువులు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించడం ద్వారా హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి తొలి ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్ తెలిపారు. వాడ వాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజుల పాటు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటూ, పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడినపడి, పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరుతూ, ఏకదంతున్ని కేసీఆర్ ప్రార్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -