- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఒక జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు.
- Advertisement -



