నవతెలంగాణ-హైదారాబాద్: బెంగాల్ తొలి విడత పోలింగ్‌లో ఘర్షణ నెలకొంది. ముర్షిదాబాద్‌లో పోలింగ్ ఎదుట టీఎంసీ, మాజీ తృణమూల్ నాయకుడు, ప్రస్తుతం ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏయూజేపీ) వ్యవస్థాపకుడైన కబీర్ హుమాయున్ కబీర్‌కు మధ్య గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఇరువర్గాల అనుచరులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు హుమాయున్ కబీర్‌ను పోలింగ్ పరిసర ప్రాంతాల నుంచి పంపించారు.
కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ప్రజలు ఉత్సహంగా పాల్గొంటున్నారు. ఉదయం 9గంటలకు పోలింగ్ శాతం 18పైగా నమోదు అయింది. మొదటి దశలో రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఉత్తర బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాల్లోని 54 స్థానాలతో పాటు ముర్షిదాబాద్, నాడియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లోని పలు స్థానాలు ఉన్నాయి.రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.



