నవతెలంగాణ – హైదరాబాద్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, వీధి బాలల జీవితం చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఏపీలో నైస్ విద్యాసంస్థ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తోంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఈ నైస్ పేరుతో విద్యాసంస్థను 2003 ఆగస్టు 15న పోపూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ బాలబాలికలకు ఉచితంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్స్, కంప్యూటర్, సైన్స్, గణితం ల్యాబ్స్, స్పోర్ట్స్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూల్‌లో తల్లిదండ్రులు కోల్పోయిన వారికి మొదట ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత తల్లి, లేదా తండ్రిని కోల్పోయినవారికి ఆ తర్వాత ప్రాధాన్యం ఇస్తారు.
ఈ స్కూల్‌లో ప్రతి ఏటా 25మంది బాలురు, 25మంది బాలికలకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఇక్కడ 5,6 తరగతుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయి. ఈ స్కూల్‌లో 5 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఉంది.. ఇక్కడ టెన్త్ క్లాస్ పూర్తి చేసిన విద్యార్థుల్ని జూనియర్ కాలేజీల్లో చేర్పిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ సంస్థ తరఫున పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ఎవరైనా టీచర్లు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే నైస్ స్కూల్‌లో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 5,6 తరగతులకు కలిపి మొత్తం 50 మందికి ప్రవేశం కల్పించనున్నారు. పదేళ్లు నిండిన బాలబాలికలు 5వ తరగతిలో అడ్మిషన్లకు అర్హులని.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఇస్తారని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు (rticleshow/130157930.cms) తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్, విద్యార్థి ఆధార్ కార్డ్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. అడ్మిషన్ల కోసం వచ్చే దరఖాస్తుల్ని బట్టి మే నెలలో నాలుగో ఆదివారం, జూన్ మొదటి ఆదివారం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దరఖాస్తుల్ని పరీక్ష నిర్వహించే ముందు రోజు వరకు స్వీకరిస్తారు.. స్కూల్‌కు వెళ్లి దరఖాస్తుల్ని పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. ఈ నైస్ స్కూల్‌లో అడ్మిషన్లకు సంబంధించి సమాచారం కోసం 63098 81257, 85198 82247 నంబర్లలో సంప్రదించాలన్నారు.



