- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో చెన్నై జట్టు ఆకాశ్ మధ్వాల్‌కు అవకాశం ఇచ్చింది. మధ్వాల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 2023, 2024 సీజన్లలో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ముంబయి తరఫున ఆడిన సమయంలో మంచి పేరు సంపాదించాడు. డెత్ ఓవర్లలో కీలక బౌలర్‌గా రాణించాడు.
- Advertisement -



