Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం 

పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

నూతన గృహప్రవేశం చేయడం సంతోషకరం
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన మాదాసు పల్లవి రవి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని గురువారం ఆ గ్రామ సర్పంచ్ పులి వెంకన్నతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి గడపగడపకి అందించే విధంగా కృషి చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

మన నియోజకవర్గంలో అదనంగా 1000 ఇండ్లను తీసుకువచ్చి ప్రతి పేదవాడికి గూడు ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి తినడానికి రేషన్ డీలర్ ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తుందని ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందని ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు వారికి పెట్టుబడి సహాయంగా 12 వేల రూపాయలను కూడా ఇస్తుందని కళ్యాణ లక్ష్మి రైతులు కష్టపడి పంట పండించేందుకు వారు నీరు అందిస్తూ అట్టి పంటకు పెట్టుబడి సహాయం ఇస్తూ పండించిన తర్వాత వారికి గిట్టుబాటు ధర ను అందిస్తూ బోనస్ 500 రూపాయలు కూడా అదనంగా ఇస్తున్న ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి చేరే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.

ఇలా ఎన్నో కార్యక్రమాలను పేదవాడికి అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పులి వెంకన్న ,వార్డు సభ్యులు ఉపేందర్, కృష్ణమూర్తి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు నరసయ్య    నాయకులు వెన్నం క్రాంతి రెడ్డి, కుమ్మరి కుంట్ల మౌనేందర్, కొంపల్లి శ్రీశైలం యాదవ్, మురళి, రత్నపురం భీముడు, అప్రోచ్ , హెచ్ రవి, పులి నరసయ్య,, వెంకన్న, సలుగు వీరేష్, ఆర్.ఎం.పి డాక్టర్ వెంకన్న. తో పాటు కొంత మంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -