Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు పైలం

ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు పైలం

- Advertisement -

వేసవి సెలవుల్లో హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల టివితోపాటు వివిధ వస్తువులను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలాగే మరికొన్ని పాఠశాలల్లో ఆకతాయిలు మద్యం సేవించి,మద్యం సీసాలు పగలదొట్టడం ఏటా పరిపాటిగా మారుతుంది.మండలంలో 5 జిల్లా పరిషత్,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల,రెండు ప్రాథమికోన్నత,28 ప్రాథమిక పాఠశాలున్నాయి.

వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇటీవల జిల్లాల విద్యాధికారు లకు మార్గనిర్దేశం చేశారు.ఈ నెల 24 నుంచి ప్రభుత్వ బడులకు సెలవులు ప్రకటించడంతో గురువారం చివరి పనిదినం సందర్భంగా 1 నుంచి 9వ తరగతుల విద్యార్థుల పరీక్షా ఫలితాల మార్కుల జాబితాను అందజేశారు.జూన్ 11 వరకు సెలవులు,12న నూతన విద్యాసంవ త్సరం మొదలు కానుంది.ఈక్రమంలో సెలవుల్లో పాఠశాలల్లోని సామగ్రి,ఆస్తులకు సంబంధించి తగిన భద్రత చర్యలు తీసుకోవాలని సూచనలు,సలహాలు జారీ చేశారు.

తీసుకోవాల్సిన చర్యలు..
విద్యుదీకరణకు సంబంధించిన భాగంలో అన్ని చోట్ల స్విచ్ ఆప్ చేయాలి.మండలంలోని ఎడ్లపల్లిలో మోడల్ స్కూల్  పీఎంశ్రీ పాఠశాలో సైన్స్ ప్రయోగశాలలు, ల్యాబ్లోని విలువైన వస్తువులు,కంప్యూటర్ ప్రయోగశాలలు వంటివి ఉన్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.గ్రంథాలయాల్లోని పుస్తకాలు,పాఠశాలలకు చెందిన దస్త్రాలు ప్రత్యేకంగా భద్రపర్చాలి.ప్రహరీలు చుట్టూ కంచెలు సరిచూసుకోవాలి.ప్రధాన గేటుకు తాళం వేయడం వంటి తదితర జాగ్రత్తలు తీసుకోవాలి.ఎక్కడైనా సీసీ కెమెరాలుంటే వాటిని పర్యవేక్షణ కోసం వినియోగించుకోవాలి.కాపలాదారులను నియమించాలి.ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పరికరాలు,వస్తువులు జాగ్రత్తగా ఉండేలా హెడ్మాస్టార్లు బాధ్యతలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.రాత్రివేళల్లో కాపలాదారులను నియమిస్తే వస్తువులు జాగ్రత్తగా ఉంటాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలి: లక్ష్మన్ బాబు..ఎంఈఓ 
మండలంలో అన్ని పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించేలా ప్రధానోపాధ్యాయులకు తెలియజేశాం.ఇప్పటికే మోడల్ స్కూల్, కేజీబీవీలకు ఆదేశాలు వచ్చాయి.రాత్రివేళల్లో పాఠశాలలకు కాపలాదారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -