నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ చిత్రపటానికి బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మండలంలోని కిషన్ రావుపల్లి గ్రామం నుండి భూపాలపల్లి మైన్ 1ఇంక్లైన్ బొగ్గు బావి వరకు పారెస్ట్లో రోడ్డు రవాణా సౌకర్యం కోసం పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన కృషి వల్లనే రోడ్డు మార్గం ఏర్పడిందని, ఆ విషయాన్ని మంథని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడానికి గురువారం పాలాభిషేకం చేపట్టినట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు,యూత్ అధ్యక్షుడు జాగిరి హరీష్,ఢిల్లీ రాజు,అజ్మీరా సమ్మయ్య,అజ్మీరా బాలాజీ నాయక్,రవీందర్,నారా రమేష్,యాదగిరి,ఇనుముల సతీష్,దేవేందర్,బండ రాజ్ కుమార్,నాగేశ్వర్ రావు,మందపల్లి శ్రీధర్,జక్కుల లక్ష్మయ్య,నారా సమ్మయ్య,తోట బాపు,తోట శంకర్,పైడాకుల చంద్రయ్య,నల్లాల బుచ్చయ్య,బండారి సత్తయ్య,పెండ్యాల రాజు,సజ్జల తిరుపతి,మధుసూదన్ రావు,పురుషోత్తం రావు,శంకర్ నాయక్ పాల్గొన్నారు.



