- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లిలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ,విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం గుడుంబా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీటర్ల నాటు సారాయి,150 లీటర్ల పులియపోసిన బెల్లం పానకం స్వాదినపర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.గుడుంబా తయారు చేసిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -



