- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది.
- Advertisement -



