సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యేకు లబ్ధిదారుని సన్మానం
నవతెలంగాణ – మద్నూర్
పేదోడి కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్ధేశ్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల్లో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో నాగేష్ రచ్చావార్ ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ క్రమంలో సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యేను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదోడి కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



