- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లచ్చన్ గ్రామ నివాసులు మనోహర్ దేశాయ్ కుమార్తె పెళ్లి గురువారం బిచ్కుంద బండ అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ క్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మనోహర్ దేశాయ్ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకకు వీరితో పాటు ఉమ్మడి మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
- Advertisement -



