Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి సంఘీభావం

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి సంఘీభావం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌/ కుషాయిగూడ
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరించకుండా మాటలతో మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ కుషాయిగూడ డిపో వద్ద కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ కార్మికులు డిపో ప్రాంగణాన్ని మార్మోగించారు.

డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మరోసారి సకల జనుల సమ్మెకు దిగాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కుట్రలు కాకుండా సమస్యల పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -