నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణ కొత్తపల్లి, ఆలేరు గ్రామాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించినట్లు తొరూరు సిడిపిఓ కమల నెల్లికుదురు సూపర్వైజర్ సరిత ఆలేరు సూపర్వైజర్ ఉషారాణి తెలిపారు. గురువారం పోషణ పక్వాడ లో భాగంగా అంగన్వాడి సెంటర్ లలో గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. పోసిన పక్వార్డులో భాగంగా మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో, మరియు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఆలేరు సెంటర్ టూ లలో ఆయా గ్రామాల అంగన్వాడి టీచర్లు కలిసి పిల్లలచే పాదాలు పలికించడం నేర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తుందని దానిని అంగన్ వాడికి వచ్చేవారు ప్రతి ఒక్కరు సద్విని మంచిగా చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. అంగన్వాడిలో దొరికే పౌష్టికాహారం తీసుకుంటే గర్భిణీలు బాలాంతలు కిశోర బాలికలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అందుకోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేవారు సజీవనం చేసుకోవాలని చెప్పారు. గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించడం టీచర్లను అభినందించండి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు ఎం విజయ, ఐ పద్మ, కె పద్మ ,ఎం పద్మ, టి జ్యోతి ,ఏ మాధవి, మంజుల ,రాజేశ్వరి, దేవికి, శ్రీ జ్యోతి, ఏం కవిత, డి కవిత ,పంచాయతీ కార్యదర్శి రవి, తో పాటు కొంతమంది పాల్గొన్నారు.



