- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల గుట్టయ్య అస్వసతకు గురై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనను గురువారం బీఆర్ఎస్ మండల నాయకులు పరుపాటి వెంకటరెడ్డి వీరగాని మల్లేశం గౌడ్ బత్తిని అనిల్ గౌడ్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి గుట్టయ్య గౌడ్ అని అన్నారు. అలాంటి వ్యక్తి అస్వస్థతకు గురవడం చాలా బాధాకరమని తెలిపారు. తను తొందరగా కోలుకొని తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం ముందుకు సాగాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగుట్ట తండా మాజీ సర్పంచ్ము భడు రాముతో పాటు కొంతమంది పాల్గొన్నారు.
- Advertisement -



