Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేసవి సెలవుల్లో పిల్లలు భద్రం: సీఐ

వేసవి సెలవుల్లో పిల్లలు భద్రం: సీఐ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టాలని తుంగతుర్తి సర్కిల్ సిఐ నరసింహారావు సూచించారు. గురువారం మండల కేంద్రంలో స్థానిక ఎస్సై క్రాంతికుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలు,యువకులు సేదతీరడానికి గ్రామాల సమీపంలోని చెరువులు, కాలువలు,కుంటల వద్దకు ఈతకు వెళ్లే వేసవి సెలవుల్లో పిల్లలు భద్రం-తుంగతుర్తి సీఐ నరసింహారావుఅవకాశం ఉందని, దీనివల్ల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలను నీటి వనరుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అలాగే, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని,యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలని సూచించారు.పిల్లల ఆహారం,ఆరోగ్యం పై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని,సరైన పోషకాహారం అందించాలని సూచించారు. తాజా పండ్లు,చల్లని పానీయాలు,నీరు ఎక్కువగా ఇవ్వాలని,ఫాస్ట్ ఫుడ్స్,జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచాలని,వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ కోసం శుభ్రమైన నీరు,మజ్జిగ,నిమ్మరసం తాగేలా అలవాటు చేయాలని సూచించారు.

పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా ఖాళీ సమయాన్ని స్ఫూర్తిని కలిగించే మహానుభావుల జీవిత చరిత్రలు చదివేలా ప్రోత్సహించాలని చిత్రలేఖనం,నాట్యం,సంగీతం వంటి సృజనాత్మక పనుల వైపు పిల్లలను మళ్లించాలని సూచించారు.అజాగ్రత్త వల్ల జరిగే అనర్థాలను అరికట్టడానికి సర్కిల్ ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -