నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. అమెరికాకు తలొగ్గి యూపీఐ చెల్లింపులపై చార్జీలు వేస్తున్నారని ఆరోపించారు. ఛార్జీలు వసూలు చేయబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ. 2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను అనుమతించడం చివరికి అధిక చిల్లర ధరలకు దారితీస్తుందని అన్నారు. అమెరికన్ చెల్లింపుల కంపెనీలు చాలా కాలంగా భారతదేశపు జీరో-ఎమ్డిఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని, మోదీ ప్రభుత్వం కూడా మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. “అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో మాదిరిగానే, రాజీపడిన ప్రధాని మోదీ మరోసారి అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నారు,” అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం యూపీఐపై ఫీజులు విధించడానికి నిశ్శబ్దంగా మరోసారి యూఎస్ కంపెనీలకు తలుపులు తెరిచిందన్నారు.
యూపీఐ చెల్లింపులపై చార్జీలు..రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



