Tuesday, September 15, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్ లో విద్యార్థుల ఆందోళన

బీహార్ లో విద్యార్థుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పేపర్ లీక్‌ల ఆరోపణల నేపథ్యంలో బీహార్ పోలీస్ ఎస్ఐ పరీక్ష, 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంగళవారం పాట్నాలో నిరసన చేపట్టారు. తమ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని, పరీక్షల ప్రక్రియలో దిద్దుబాటు చర్యలు, పారదర్శకత పాటించాలని విద్యార్థులు డిమాండ్ డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, నిరసన ప్రదేశంలో భారీ భద్రతను మోహరించారు.

ఏకీకృత ఒకే-పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు, జరగబోయే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలను వాయిదా వేసినట్లు ఈ నెల 2న బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ప్రకటించారు. అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, సన్నాహాల కోసం BPSCకి సమయం అవసరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈక్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -