Friday, April 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుక్కల దాడిలో లేగ దూడ మృతి

కుక్కల దాడిలో లేగ దూడ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం నాడు కుక్కల దాడితో హనుమాన్ మందిర లేగ దూడ మృతి చెందింది. మండల కేంద్రంలో కుక్కల బెడద అధికం కావడం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల పశువుల, మనుషుల పైన దాడులు చేయడం వాటితో రక్షణ కరువైంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా భయం భయం అవుతుందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మృతిచెందిన లేగ దూడ మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలోని హనుమాన్ మందిరానికి చెందిన లేగ దూడగా కొందరు చెప్తున్నారు. మృతిచెందిన లేగ దూడను పంచాయతీ ఆరో వార్డు సభ్యులు నరేష్ సందర్శించి పరిశీలించారు. కుక్కల నివారణపై చర్యలు తీసుకోవాలని అవార్డు సభ్యులు పంచాయతీ అధికారులకు కోరడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -