Friday, April 24, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌లో పర్యటించనున్న యుఎన్ జీఏ అధ్యక్షురాలు

భారత్‌లో పర్యటించనున్న యుఎన్ జీఏ అధ్యక్షురాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలెనా బేర్ బాక్ వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నట్లు ఆమె ప్రతినిధి తెలిపారు. ఈ పర్యటనలో ఆమె పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు అన్నాలెనా వచ్చేవారం న్యూఢిల్లీతో పాటు బీజింగ్ లోనూ అధికారిక పర్యటన చేపట్టనున్నారని ఆమె ప్రతినిధి లా నిస్ కాలిన్స్ గురువారం నిర్వహించిన రోజువారీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారత్, చైనా ప్రభుత్వాల ఆహ్వానం మేరకు ఆమె పర్యటిస్తున్నారని అన్నారు. భారత్ పర్యటన సందర్భంగా ఆమె పలువురు ప్రభుత్వ అధికారులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించడంతో పాటు యుఎన్ రెసిడెంట్ కో ఆర్డినేటర్ స్టీఫన్ ప్రిస్నర్ నేతృత్వంలో భారత్ లోని ఐక్యరాజ్యసమితి బృందాన్ని కూడా కలుస్తారని అన్నారు. అనంతరం చైనాకు వెళ్లారని, అక్కడ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని అన్నారు.

అలాగే రెసిడెంట్ కో ఆర్డినేటర్ స్టీఫెన్ జాక్సన్ నేతృత్వంలోని యుఎన్ బృందాన్ని కలుస్తారని అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలి హోదాలో ఆమె భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో జర్మనీ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో భారత్ లో పర్యటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ న్యూఢిల్లీలో జరిగిన ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్ ను సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -