- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్‌లో గురువారం తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి దఫాలో 91.91శాతం భారీగా పోలింగ్ నమోదు అయింది. ఈనెల 29న రెండో విడతలో మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో ఆ రాష్ట్రంలో పలు పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.తాజాగా ఈ ఘర్షణలకు సంబంధించి 41మంది అరెస్ట్ చేసినట్లు ఏడీజీ ఆనంద్ కుమార్ తెలియజేశారు. వారిపై BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
- Advertisement -



