Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంపాకిస్థాన్‌ దౌత్యవేత్తకు సమన్లు

పాకిస్థాన్‌ దౌత్యవేత్తకు సమన్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత నౌకను పాకిస్థాన్‌ నౌక ఢీకొట్టడంపై భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ దౌత్యవేత్తకు బుధవారం నోటీసులిచ్చింది. ఇది ‘‘ఆమోదయోగ్యం కాని’’,‘‘ అనైతికమైన చర్య’’ గా భారత విదేశాంగ శాఖ (ఎంఈఎ) అభివర్ణించింది. అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధ నౌకను మంగళవారం పాక్‌ నౌక ఢీకొట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ నౌక నిబంధనకు విరుద్ధంగా అధికవేగంగా నౌకను నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన కారణంగా పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ, పాకిస్థాన్‌ నౌకాదళ ప్రవర్తన 1991 ఏప్రిల్‌ నాటి సైనిక విన్యాసాలు, దళాల కదలికలపై ముందస్తు నోటీసుకు సంబంధించి భారత పాకిస్థాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్‌ 10కి పూర్తి విరుద్ధంగా ఉంది అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్ష‍ాల మధ్య ఉన్న ఒప్పందాలను గౌరవించాలని పాక్‌ ప్రభుత్వానికి తెలియజేయాలని పాకిస్థాన్‌ తాత్కాలిక దౌత్య ప్రతినిధికి సూచించినట్లు పేర్కొంది. అలాగే ఇస్లామాబాద్‌లోని భారత తాత్కాలిక రాయబారిని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వద్ద ఇదే తరహా నిరసనను వ్యక్తం చేయాల్సిందిగా ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -