Thursday, September 17, 2026
E-PAPER
Homeజాతీయంఉదంపూర్ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం..

ఉదంపూర్ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఉదంపూర్ జిల్ల‌లో ఇవాళ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు. ఉదంపూర్ జిల్లాలోని మ‌జాల్తాలో అనుమానాస్ప‌ద క‌ద‌లిక‌లు ఉన్న‌ట్లు బుధ‌వారం సాయంత్రం అధికారుల‌కు స‌మాచారం అందింది. దీంతో సంయుక్త బ‌ల‌గాలు ఆ ప్ర‌దేశంలో కార్డ‌న్ సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఆ త‌ర్వాత ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య కాల్పులు మొద‌ల‌య్యాయి. గ‌న్‌ఫైట్ స‌మ‌యంలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇంకా కూంబింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.

అయితే హ‌త‌మైన ఉగ్ర‌వాదుల ఐడెంటిటీ ఇంకా తెలియాల్సి ఉన్న‌ది. జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు, స్పెష‌ల్ పారాట్రూప‌ర్లు తొలుత సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. ఎన్‌కౌంట‌ర్ స్టార్ట్ కావ‌డంతో ఆ ప్ర‌దేశానికి అద‌న‌పు బ‌ల‌గాలు హుటాహుటిన చేరుకున్నాయి. ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జేకే పోలీసు ఎస్ఓజీ కూడా సెర్చ్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి. ఇటీవ‌ల పిర్ పంజల్ ప్రాంతంలో ల‌ష్కరే తోయిబాకు చెందిన ఓ అండ‌ర్‌గ్రౌండ్ నెట్వ‌ర్క్‌ను గుట్టు విప్పిన నేప‌థ్యంలో అక్క‌డ భ‌ద్ర‌త‌ను పెంచారు. పిర్ పంజాల్ ప్రాంతంలో టెర్ర‌ర్ మాడ్యూల్ న‌డిపిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను సెప్టెంబ‌ర్ 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -