- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో అధికారులు ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారు. సర్వే నెంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్లపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మర్కుక్ తహశీల్దార్ ఆఫీసులో ఆర్డీవో చంద్రకళ రికార్డులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూమి ఉందా?.. పట్టా భూమి ఎంత అనేది తేల్చేపనిలో ఉన్నారు.
- Advertisement -



