Thursday, September 17, 2026
E-PAPER
Homeజాతీయంవీధి కుక్కల బెడద..మహారాష్ట్రలో వినూత్న నిరసన..వీడియో

వీధి కుక్కల బెడద..మహారాష్ట్రలో వినూత్న నిరసన..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని నాసిక్‌లో వీధి కుక్కల బెడదతో విసిగిపోయిన స్థానికులతో కలిసి యువసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వీధి కుక్కలను పట్టి సంచుల్లో తెచ్చి అధికారి బల్లపై వాటిని వదిలిపెట్టారు. ఇది చూసి ఆ అధికారి షాక్‌ అయ్యారు. అలాగే ఆయన మెడలో నోట్ల దండలు వేసేందుకు యువసేన నేతలు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 15న ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు చెందిన యువసేన కార్యకర్తలు నిఫాద్ నగర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంధవే ఒక సంచిని విప్పారు. అందులో ఉన్న చిన్న కుక్కను అధికారి ధీరజ్ భమ్రే టేబుల్‌పై వదిలారు. షాకైన ఆ అధికారి తన కుర్చీ నుంచి లేచి వెనక్కి జరిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -