నవతెలంగాణ-హైదరాబాద్: సిక్కింలో కురిసిన భారీ వర్షాల కారణంగా గురువారం గ్యాంగ్టక్లోని టాడాంగ్లో గల లింగ్డింగ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాద ధాటికి ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు, ఆ ప్రాంతంలో రహదారి అనుసంధానానికి అంతరాయం ఏర్పడింది. ఈ కొండచరియల విపత్తు కారణంగా జె.ఎన్. భట్టరాయ్ ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా, మొదటి అంతస్తులోని గదుల్లోకి నీరు, బురద చేరాయి. ఆ ప్రాంతానికి నీటిని సరఫరా చేసే మూడు ప్రధాన పైప్లైన్లు కూడా దెబ్బతినడంతో, స్థానిక నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానిక నివాసితుల ప్రకారం, లింగ్డింగ్ ఝోరా సమీపంలోని రహదారి తెల్లవారుజామున 3 గంటల నుండి 9 గంటల వరకు పూర్తిగా పైప్ లైన్ తెగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
గ్యాంగ్టక్లో విరిగిపడిన కొండచరియలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

