- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హరిబాబు అనే వ్యక్తిని దుండగులు కొబ్బరికాయలు కోసే కత్తితో నరికి చంపారు. ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడని సమాచారం. పాత కక్షతోనే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరిబాబు మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
- Advertisement -



