- కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారని ఆరోపిస్తూ.. కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ గురువారం ఆయన పుట్టినరోజును ‘ప్రపంచ నిరుద్యోగ దినోత్సవం’గా పాటించింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్, ప్రధానమంత్రికి వ్యంగ్యాస్త్రాలతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు, బ్యానర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హెచ్ఎస్ మంజునాథ్ గౌడ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి సిద్ధమయ్యే యువత పరీక్షలలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాలలో జాప్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



