Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
విశ్వకర్మ జయంతి వేడుకలను రాయపోల్ మండల కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించి, విశ్వకర్మ భగవానుడిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మలు తరతరాలుగా తమ సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శిల్పకళ, వడ్రంగి, కమ్మరి, స్వర్ణకార తదితర చేతివృత్తుల్లో తమ నైపుణ్యంతో సమాజానికి సేవలందిస్తున్న విశ్వకర్మల ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు బ్రహ్మచారి, సంతోష్ చారి, సుదర్శన్ చారి, బాల్ చారి, నరసింహ చారి, రాజు చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -