Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్22 ఏ భూముల జాబితాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

22 ఏ భూముల జాబితాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

- Advertisement -

-బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అనుమాండ్ల రాజిరెడ్డి
నవతెలంగాణ – రాయపోల్

22 ఏ భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు అనుమాండ్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏ జాబితాలో భూములు ఉండటంతో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ, వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు 22 ఏ జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు తదితర వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ, 22 ఏ జాబితాలో పేర్లు ఉండటంతో తమ ఆస్తులను స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నామని పలువురు భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించాలని.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 22 ఏ భూముల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజిరెడ్డి కోరారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న భూములను నిబంధనల ప్రకారం 22 ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు.భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష నిర్వహించి, జిల్లా స్థాయిలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

22 ఏ జాబితాలో ఉన్న భూములపై అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి, వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూయజమానులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి భూమి రైతుకు అత్యంత విలువైన ఆస్తి అని, భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని ఆయాన అన్నారు. భూ రికార్డుల పరిశీలన, హక్కుల నిర్ధారణ, 22 ఏ జాబితా నుంచి తొలగింపు వంటి ప్రక్రియల్లో పారదర్శకత పాటించాలని కోరారు.ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, 22 ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, భూ యజమానుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -