Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం ఉద్యమిద్దాం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం ఉద్యమిద్దాం

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ 
– సిద్ధారంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభ 
నవతెలంగాణ-సత్తుపల్లి 

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం సిద్దారం గ్రామంలో యలగం రాములు అధ్యక్షతన తెలంగాణ రైతాంగ  సాయుధ పోరాట వారోత్సవాల సభ జరిగింది. ఈ సభలో శ్రీనివాస్ ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సాగించిన వీరోచిత ఉద్యమమే ఈ పోరాటమని కొనియాడారు.

నాటి పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు అనుభవించిన అణచివేతను వివరించారు. ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలు సంఘటితమై, పోరాడి తమ హక్కులను సాధించుకున్నారని గుర్తుచేశారు. ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై పోరాడడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అయినంపూడి  సనందనరావు, కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, దాట్ల రాంబాబు, బెజవాడ  లక్ష్మీనారాయణ, తోటకూర నారాయణమ్మ, ఆంగోతు చిట్టెమ్మ, రేసు లక్ష్మి, ముత్తిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -